A pure survey rally by Rayalaseema Children's Academy in Punganur.

పుంగనూరులో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిచే స్వచ్చ సర్వేక్షణ్‌ ర్యాలీ.

Date : 05/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాగంగా పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లెక్సిలు పట్టుకుని స్వచ్చ సర్వేక్షణ్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షణ్‌ కార్యక్రమాన్ని వందశాతం అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులచే స్వచ్చంధంగా పాల్గొనడం జరిగిందన్నారు. స్వచ్చ సర్వేక్షణ్‌లో ప్రతి ఒక్కరు భాగస్వాములై పుంగనూరు కీర్తిని భారతదేశ స్థాయికి తీసుకెళ్లాలని చంద్రమోహన్‌రెడ్డి పుంగనూరు పట్టణ ప్రజలను కోరారు.

Tags : A pure survey rally by Rayalaseema Children’s Academy in Punganur.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *