A sex rocket

 కలకలం రేపుతున్న సెక్స్ రాకెట్

Date:18/06/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అమెరికాలో ప్రొడక్షన్ మేనేజర్ సెక్స్ రాకెట్ కలకలం రేపుతోంది. పలువురు హీరోయిన్లను అమెరికా అధికారులు విచారిస్తున్నారు. తాజాగా హీరోయిన్ మెహరీన్ పిర్జాదాను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరగంటపాటు విచారించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. కెనడాలోని వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను నిలిపేసిన ఇమిగ్రేషన్ అధికారులు.. అరగంట పాటు విచారించారని ఆమె చెప్పారు. అమెరికాలోని తన తల్లిదండ్రులను చూసేందుకు వెళుతున్నానని, ఆ సమయంలోనే అమెరికా హోంలాండ్ ఇమిగ్రేషన్ అధికారులు తనను ఆపారని చెప్పారు.‘‘అమెరికాలో తెలుగు సినిమా సెక్స్ రాకెట్ గురించి తెలిసి షాకయ్యాను. వారు చెప్పేదాకా నాకు ఆ విషయమే తెలియదు. నేను తెలుగు హీరోయిన్‌ను అని తెలుసుకుని నన్ను ఆపారు. దాదాపు అరగంట దాకా నన్ను ప్రశ్నించారు. అమెరికా ఎందుకు వచ్చారని అడిగారు. నా తల్లిదండ్రులను చూసేందుకు అని చెబితే.. ఆధారాలేంటి అని అడిగారు. తరచూ నేను అమెరికా వెళ్లివస్తుంటానని వారికి చెప్పాను. అన్ని ఆధారాలు పరిశీలించి వదిలేశారు’’ అని ఆమె తెలిపారు. కాగా, మరికొంతమంది తెలుగు తారలనూ అమెరికా అధికారులు దాదాపు 6 గంటలపాటు విచారించినట్టు సమాచారం. అమెరికాలోని షికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ కిషన్ మోదుగుమూడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, అతడి భార్య చంద్రకళ అలియాస్ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Tags:A sex rocket

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *