'A' teaser release

‘అ’ టీజర్‌ విడుదల

ఈనాడు.

Date :04/01/2018

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నాని తొలిసారి నిర్మాతగా తెరకెక్కస్తున్న చిత్రం ‘అ’. కాజల్‌, రెజీనా, నిత్యామేనన్‌, ప్రియదర్శి, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్‌, కాజల్‌, రవితేజ, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన విభిన్నమైన ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు సినిమా టీజర్‌ను విడుదల చేసింది.టీజర్‌లో చేపకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న నాని మాట్లాడుతూ..‘మీకొక కథ చెప్తా. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ నాలాంటి ఏడు అమాయక చేపల్ని పట్టుకున్నారు’ అని ఏడుస్తూ అంటాడు. ఇందుకు చెట్టుకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్న రవితేజ స్పందిస్తూ..‘నేను విత్తనంగా ఉన్నప్పటి నుంచి వింటున్నా. కొత్తగా ఏదన్నా చెప్పండ్రా’ అని అనడం నవ్వులు పూయిస్తోంది. రవితేజ ప్రశ్నకు నాని..‘కొత్తగా అంటే..ఈ టీజర్‌ చూడండి’ అంటాడు. టీజర్‌లో నిత్యమేనన్‌, మురళీ శర్మ, ఈషా రెబ్బా, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌ల పాత్రలను చూపించారు. అనంతరం టీజర్‌ గురించి రవితేజ స్పందిస్తూ..‘అదిరిపోయింది. ఇంతకీ హీరో ఎవరో..’ అని అడుగుతాడు. ఇందుకు నాని..‘కథే హీరో’ అంటాడు. నాని సమాధానం విని ‘అ!’ అంటాడు రవితేజ. ‘అదే టైటిల్‌’ అని నాని అనడం సినిమాలపై అంచనాలను పెంచేస్తోంది.ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags :’A’ teaser release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *