ఎయిరిండియా సిబ్బందిని కొట్టిన మహిళ

దిల్లీ ముచ్చట్లు:
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లోకెక్కింది. ఓ మహిళ ఎయిరిండియా సిబ్బందిపై చేయి చేసుకుంది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. దిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఓ యువతి టికెట్ కౌంటర్ దగ్గర ఎయిరిండియా సిబ్బందిని కొట్టింది.దిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఓ మహిళ విమానాశ్రయానికి వచ్చింది. ఆలస్యంగా రావడంతో విమానం మిస్సయ్యారు. దీంతో అక్కడ ఉన్న డ్యూటీ మేనేజర్తో సదరు మహిళ వాగ్వాదానికి దిగి సిబ్బందిపై చేయి చేసుకుంది. పోలీసులు, భద్రతా సిబ్బంది చొరవతో గొడవ సద్దుమణినట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు.విమాన సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవడంతో విమానాయాన శాఖ ‘నో ఫ్లై లిస్ట్’ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎయిరిండియా సిబ్బందిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేయి చేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైన తర్వాత ఈ జాబితాను తీసుకొచ్చారు. విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుల పేర్లను ఆ జాబితాలో చేర్చనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *