Aadhaar card is mandatory along with the petitions - Madanapalle sub collector Vetricelli

అర్జీలతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి  – మదనపల్లె సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి

Date : 10/12/2017
మదనపల్లె ముచ్చట్లు : 
ప్రజలు తమ సమస్యలను పరిష్కారం కోసం ఇచ్చే అర్జీలతో పాటు వారి యొక్క ఆధార్ కార్డు నకలును జతచేసి ఇవ్వాలని సబ్ కలెక్టర్ వెట్రిసెల్వి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం సబ్ కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాలనుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందజేస్తుంటారని ఆమె తెలిపారు. త్వరితగతిన సమస్యలను గుర్తించి పరిష్కారంలో సౌలభ్యం కోసం అర్జీదారులు దరఖాస్తుతో పాటు వారి ఆధార్ కార్డు నకలును తప్పనిసరిగా జత చేయాలని ఆమె సూచించారు.
Tags : Aadhaar card is mandatory along with the petitions – Madanapalle sub collector Vetricelli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *