‘ఆధార్‌’ భద్రత డొల్లేనా?

న్యూఢిల్లీ ముచ్చట్లు:

యుపిఎ ప్రభుత్వానికి భారీగా ఓట్లు తెచ్చి పెడుతుందని భావించిన ‘భారత్‌ ఏకీకృత గుర్తింపు సంస్థ (యుఐడిఎఐ)’ 2011 ఫిబ్రవరిలో బయోమెట్రిక్‌ నిర్ధారణ పరికరాలకు ఫ్రాన్స్‌కు చెందిన ఓ విదేశీ సంస్థతో కాంట్రాక్ట్‌ కుదుర్చుకుంది. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ వల్ల బయటకు వచ్చింది. ఈ కాంట్రాక్ట్‌ కింద ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని ఈ సంస్థ వెల్లడించలేదు. ఫ్రాన్స్‌కు చెందిన సంస్థకు ఎంత చెల్లించామో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని గత అక్టోబర్‌ 25వ తేదీన యుఐడిఎఐ, తనకిచ్చిన సమాధానంలో తెలిపిందని ఆర్‌టిఐ కార్యకర్త ఖనీజ్‌ సుకర్ణీ తెలిపారు. ఎల్‌1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌తో 2010 జులైలో జరిగిన ఒప్పందంతో రూ.33.87 కోట్లు, ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్తో అదే ఏడాది ఫిబ్రవరిలో రూ.7 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది ‘యుఐడిఎఐ’. ఇదిలా ఉంటే సాగెం మోర్ఫో సెక్యూరిటీ అనే ఫ్రాన్స్‌ సంస్థ, ఎల్‌1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌ సంస్థను స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉంటే మరో రెండు బహుళ జాతి సంస్థలకు కూడా కాంట్రాక్టుల కోసం డబ్బు చెల్లించామని ‘యుఐడిఎఐ’ పేర్కొనడం గమనార్హం. ఈ రెండు సంస్థల్లో ఎల్‌1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థలున్నాయి. ఎల్‌1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌, సాగెం మోర్ఫో అనుబంధ సంస్థ కావడం గమనార్హం. అయితే ‘యుఐడిఎఐ’ అధికార వర్గాల వైఖరి అనుమానాస్పదంగా ఉందని పౌర హక్కుల సిటిజన్‌ ఫోరమ్‌ ప్రతినిధి గోపాలకృష్ణ పేర్కొన్నారు. యుఐడిఎఐ, ఎల్‌1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గత సెప్టెంబర్లో సమాచారం తమకు వచ్చిందని గోపాలకృష్ణ చెప్పారు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది పౌరుల నుంచి ఈ సంస్థ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందా? అన్న అనుమానం వస్తున్నదని గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎల్‌ 1 ఐడెంటిటీ సొల్యూషన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ‘ఆధార్‌’ కింద సేకరించిన సమాచారం, అమెరికా, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలు పొందేందుకు వీలు కలుగుతుందని గోపాలకృష్ణ తెలిపారు. అమెరికాకు చెందిన ఓ సంస్థతో హడావుడిగా భేటీ కావడం సందేహాలకు తావిస్తోందన్నారు. ఈ అమెరికా సంస్థ, ఫెడరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం, సిఐఎలతో లావాదేవీలు జరుపుతున్నదని గోపాలకృష్ణ పేర్కొన్నారు. మోంగో డిబి అనే ఈ అమెరికా సంస్థ సిఇఓ మాక్స్‌ స్కైహెరెసోన్‌ ఇటీవలే ఢిల్లీకి వచ్చి యుఐడిఎఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు. మోంగో డిబి సంస్థ ‘ఇన్‌ క్యూ టెల్‌’ సహా పలు సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు కలిగి ఉంది. ఇన్‌ క్యూ టెల్‌ సంస్థను 1999లో సిఐఎ నిర్వహించడం గమనార్హం. ఇన్‌ క్యూ టెల్‌, తమ స్వచ్ఛంద సంస్థ మోంగో డిబి తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Tag : ‘Aadhaar’ security is a doll?


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *