పంజాబ్‌లో ప్రతిపక్షాలను చీపురుతో ఊడ్చిపారేసిన ఆమ్ఆద్మీ.
హర్యానా ముచ్చట్లు:
పంజాబ్‌లో ఆమ్ఆద్మీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలను చీపురుతో ఊడ్చిపారేస్తోంది. ప్రతిపక్షాలు ఆప్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ముందు నుంచి కూడా పంజాబ్‌లో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. సీఎం అభ్యర్థి విషయంలోనూ ఒంటెత్తు పోకడలకు పోకుండా, ప్రజలు నిర్ణయించిన వారే సీఎం అభ్యర్థి అంటూ తేల్చి చెప్పారు. చివరికి ప్రజలు భగవంత్ మాన్ వైపే మొగ్గు చూపారు. కేజ్రీవాల్ కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ధూరీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ గెలుపొందారు కూడా. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దల్బీర్ సింగ్‌పై గెలుపొందారు.
Tags:Aam Aadmi Party sweeps opposition in Punjab