శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆల‌యాల‌ నిర్మాణ పనులు వేగ‌వంతం చేయండి

– శ్రీ‌వాణి ట్ర‌స్టుపై ఈవో స‌మీక్ష‌
 
తిరుప‌తి ముచ్చట్లు:
 
శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఆల‌యాల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. దేవాదాయ శాఖ ద్వారా నిర్మిస్తున్న 1100 ఆల‌యాలపై టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని త‌న కార్యాల‌యంలో శ‌నివారం ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ పురాత‌న ఆల‌యాల పున‌ర్నిర్మాణం, వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ఆల‌యాలు లేనిచోట ఆల‌యాల నిర్మాణంపై దృష్టి పెట్టాల‌న్నారు. దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్‌తో చ‌ర్చించి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిధులు మంజూరు చేసిన ఆల‌యాల నిర్మాణం, పున‌ర్నిర్మాణం, జీర్ణోద్ధ‌ర‌ణ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఆల‌యాల నిర్మాణానికి సంబంధించి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై స‌మీక్షించారు. త‌దుప‌రి చ‌ర్య‌లపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 14 ఆల‌యాల నిర్మాణం, పున‌రుద్ధ‌ర‌ణ‌, పున‌ర్నిర్మాణం కోసం రూ.8.45 కోట్లు నిధులు మంజూరుకు ఈవో ఆమోదం తెలిపారు.ఈ స‌మీక్ష‌లో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ సిఇ ప్ర‌సాద్‌, డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ డా. రమ‌ణ‌ప్ర‌సాద్‌, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ అధికారి శ్రీ లంక విజ‌య‌సార‌ధి త‌దిత‌రులు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Accelerate the construction work of Srivani Trust temples

Natyam ad