పుంగనూరులో అంగన్‌వాడీ ఉద్యోగాలకు ధరఖాస్తులు స్వీకరణ

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలు ఉద్యోగాలకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ భారతి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ రెండు మండలాల్లోను ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగిందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐసిడిఎస్‌ కార్యాలయంలో ధరఖాస్తులు సమర్పించాలన్నారు. ధరఖాస్తు వెంట ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సర్టిపికేట్లు జతపరచాలని ఆమె తెలిపారు. జూన్‌ 6తేదీ సాయంత్రంలోపు ధరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందని ఆమె తెలిపారు.

 

Tags; Acceptance of applications for Anganwadi jobs in Punganur

Post Midle
Post Midle