యథాతథంగా  ప్రజాఫిర్యాదుల స్వీకరణ

– “స్పందన” కార్యక్రమం
 
కడప ముచ్చట్లు:
 
మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం దొరకని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే స్పందనకు రాగలరు.అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు.కడప ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ సోమవారం (21-02-22) “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు.ముఖ్యంగా.. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని (పరిష్కారం కానట్లు స్పందన అర్జీల రసీదు కలిగిన) .. అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే స్పందనకు రాగలరని తెలిపారు. అధికారులతో సహా ప్రతి ఒక్కరూ కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
 
Tags: Acceptance of public complaints as such

Natyam ad