Accidentally dead person dies

ప్రమాదవశాత్తూ బావిలోపడి వ్యక్తి మృతి

Date:08/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు :

మండలంలోని బసవరాజు కండ్రిక గ్రామంలో ప్రమాదవశాత్తూ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన నారాయణప్ప కుమారుడు వీరభద్ర (33) అనే వ్యక్తి తన పొలంలోని కొబ్బరి చెట్లకు నీళ్ళు పోయడానికి పొలానికి వెళ్లాడు. నీళ్ళకోసం బావిలోకి దిగి కాలుజారి నీళ్ళలో పడి మృతిచెందాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్సై చంద్రమోహన్ ఆద్వర్యంలో కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags : Accidentally dead person dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *