కోటి మందికి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్-2018పై చైత‌న్యం

– బ‌ల్దియా విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాలు
Date:13/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో న‌గ‌రంలోని ప్ర‌తిఒక్క‌రిని చైత‌న్యప‌ర్చేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్ర‌చార‌, చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను  చేప‌ట్టింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని కోటి 20ల‌క్ష‌ల మంది జ‌నాభాకు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించ‌డం ద్వారా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంచ‌డానికి విస్తృత స్థాయిలో కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది జీహెచ్ఎంసీ. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు స్వ‌యంగా ప‌దిహేను వేల మందితో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ చైత‌న్య కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో పాటు, బొంతు రామ్మోహ‌న్ జోన్‌ల వారిగా నిర్వ‌హించిన స‌మావేశాల్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి అయితే, త‌న‌కు ల‌భించిన ప్ర‌తి స‌మావేశాన్ని స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించ‌డానికి ఉప‌యోగించుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ఏడు ఎల‌క్ట్రానిక్ మీడియా న్యూస్ ఛాన‌ళ్ల‌కు, అన్నీ ఎఫ్‌.ఎం రేడియో ఛాన‌ళ్ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూలు ఇచ్చి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో ఎందుకు అగ్ర‌స్థానంలో నిల‌పాల‌నే విష‌యాన్ని గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రిస్తారు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 పై జీహెచ్ఎంసీ నిర్వ‌హించిన చైత‌న్య కార్య‌క్ర‌మాలు….
* హైద‌రాబాద్ న‌గ‌రంలోని 20ల‌క్ష‌ల మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారుల మొబైల్ ఫోన్‌ల‌కు ఎస్‌.ఎం.ఎస్‌ల‌ను రెండు సార్లు పంపించ‌డం జ‌రిగింది.
* గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న 45వేల స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా బృందాల‌లోని 4.5ల‌క్ష‌ల మంది స‌భ్యుల‌కు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై  చైత‌న్య‌ప‌రిచి వారిచే న‌గ‌రంలోని ప్ర‌జ‌ల‌కు వివ‌రింప‌జేయ‌డం జ‌రిగింది.
* 3, 500 స్వ‌చ్ఛ దూత్‌ల నియామ‌కం ద్వారా ఇంటింటికి వెళ్లి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో అడిగే ఆరు ప్ర‌శ్న‌ల‌కు సానుకూల స‌మాధానం ఇవ్వాల్సిందిగా తెలియ‌జేయ‌డం జ‌రిగింది.
* న‌గ‌రంలోని ఐదు జోన్‌ల వారిగా భారీ స‌మావేశాలు ఏర్పాటు చేయ‌డం ద్వారా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించ‌డం జ‌రిగింది.
* ఎల‌క్ట్రానిక్ మీడియాకు చెందిన ప‌లు వార్తా చాన‌ళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం ద్వారా న‌గ‌ర ప్ర‌జ‌లు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018పై అడిగిన ప‌లు సందేహాల‌ను తీర్చ‌డం జ‌రిగింది.
* అన్ని ఎఫ్‌.ఎం రేడియో చాన‌ళ్ల ద్వారా ప్ర‌త్యేక ప్ర‌చార ఇంట‌ర్వ్యూల‌కు క‌మిష‌న‌ర్ హాజ‌రు.
* వివిధ టి.వి. ఛాన‌ళ్ల ద్వారా స్క్రోలింగ్‌లు, రేడియో ఛాన‌ళ్ల‌లో జింగిల్స్ ద్వారా ప్ర‌క‌ట‌న‌లు
* న‌గ‌రంలో భారీ హోర్డింగ్‌లు, బ‌స్ షెల్ట‌ర్ల ద్వారా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 పై ఏర్పాటు
* సినీ న‌టులు, సెల‌బ్రేటీల ద్వారా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం, చైత‌న్య కార్య‌క్ర‌మాల ఏర్పాటు.
* స్వ‌చ్ఛ నినాదాల‌పై పోటీల నిర్వ‌హ‌ణ‌.
* స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌, త‌డి, పొడి చెత్త విడ‌దీయ‌డం, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌పై న‌గ‌రంలోని అన్ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో క‌వితా స‌మ్మేళ‌నాల ఏర్పాటు.
* స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018పై 5కె ర‌న్‌ల ఏర్పాటు.
* ఇంటింటికి వెళ్లి బొట్టు ద్వారా చైత‌న్యం
* చెత్త విడాకుల దినోత్స‌వం, చెత్త వారోత్స‌వాలు త‌దిత‌ర వినూత్న కార్య‌క్ర‌మాల ద్వారా చైత‌న్యం.
* పాత్రికేయుల స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌, వ‌ర్గాల వారిగా స‌మావేశాలు, అన్ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో జీహెచ్ఎంసీ అధికారుల ప‌ర్య‌ట‌న‌లు.
Tags: Achievement of Patience Survey -2018 for Citizens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *