ఆచితూచి జేడీ అడుగులు

ఒంగోలు ముచ్చట్లు:

జేడీ లక్ష్మీనారాయణ గా పేరు పొందిన ఐపిఎస్ మాజీ అధికారి వివి లక్ష్మి నారాయణ కొత్త పార్టీ పెట్టబోతున్నాడా? అది తన సొంత ఆలోచన నా, లేక తెర వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా? అసలు జేడీ కి పార్టీ పెట్టి నడిపించగల సత్తా ఉందా? కాపు లను సంఘటితం చేయడానికి అని చెప్తాడా లేక విడగొట్టడానికి ఎవరో పన్నిన ప్లాన్ లో పావు గా మారుతున్నాడా? ఇంతకీ జేడీ పార్టీ వెనుక లక్ష్యం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..మహారాష్ట్ర కేడర్ ఐపిఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ… సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్‌. రాష్ట్రవిభజనకు ముందు పలు అవినీతి కేసుల విచారణలో కీలకంగా వ్యవహించడంతో… ఆయన పేరు మార్మోగిపోయింది. సంచలనాత్మక కేసులను డీల్ చేసిన అధికారిగా జేడీ బాగా పాపులరయ్యారు. డెప్యుటేషన్ పూర్తయ్యాక తిరిగి మహారాష్ట్ర కు వెళ్లిన ఆయన… అడిషనల్ డీజీపీ స్థాయిలో వీఆర్‌ఎస్‌ తీసుకోవడం కలకలం రేపింది. ఆయనతో బీజేపీయే కావాలని రాజీనామా చేయిందన్న వాదనలు వినిపించాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగుతారనే ప్రచారమూ జరిగింది. అయితే, అనూహ్యంగా ఆయన జనసేనకు జై కొట్టారు. 2019లో విశాఖ ఎంపీ స్థానానికి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటికీ.. 2 లక్షలకు పైగా ఓట్లు సాధించారు.2024లో జేడీ పోటీ ఎక్కడ?.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్నాళ్లు జనసేన లోనే ఉన్నా..

 

 

 

Post Midle

ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసారు. అప్పట్నుంచి రాజకీయాలకు దాదాపు దూరం జరిగిన ఆయన.. తూర్పుగోదావరి జిల్లాలో 12 ఎకరాలు లీజుకు తీసుకుని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఏరువాక లాంటి రైతు సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రాష్ట్రంలో కీలక సంఘటనలు జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్ని సందర్శిస్తూ తన అభిప్రాయాల్ని షేర్‌ చేసుకుంటున్నారు. అయితే, 2024ఎన్నికలకు జేడీ రూటెటు? అనే చర్చ మొదలెందిప్పుడు. ఆయన ఈసారి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారన్న విషయంలో.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్‌ సన్నిహితుడి మార్గదర్శనంలోనే.. ఒకానొక సమయంలో బిజెపి, టిడిపిలలో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు జరిపారు లక్ష్మీనారాయణ. తిరిగి జనసేనలోకే వెళ్లాలన్న ఆలోచన కూడా జేడీ చేశారనీ.. దానికి సంబంధించి ప్రాథమికంగా చర్చలు కూడా జరిపారనీ తెలిసింది. ఆ తర్వాత, పార్టీల గురించి ఆలోచించడం మానేసి… స్వతహాగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు ఈ మాజీ ఐపీఎస్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొంతమంది తన కీలక అనుచరులతో జేడీ చర్చించారు. తమనాయకుడి మాటలతో షాకైన ఫాలోవర్సు.. అసలు విషయం ఆరా తీస్తే షాకింగ్‌ నిజాలు తెలిశాయంట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కి అత్యంత సన్నిహితంగా మెలిగిన తూర్పుగోదావరి జిల్లా కాపు నేత… జేడీకి ఈ విధమైన మార్గదర్శనం చేసినట్టు గుర్తించారట. పవన్ కల్యాణ్‌ను, జనసేనను దెబ్బకొట్టేందుకు.. ప్రత్యర్థుల చేతిలో ఆయన పావులా మారారని కొందరు జేడీ అనుచరులే చెబుతున్నారట. కాపు నేతగా జేడీకి పెద్దగా గుర్తింపు లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందనీ.. అందుకే ఆయనను ప్రస్తుతం విశ్వసించలేమనీ కీలక అనుచరులే చెబుతుండటం విశేషం.

 

Tags:Achituchi Jedi feet

Post Midle
Natyam ad