పుంగనూరులో వేసవిలో నీటి సమస్య లేకుండ చర్యలు -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:
 
మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను నీటి సమస్య లేకుండ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం ఆయన , కమిషనర్‌ రసూల్‌ఖాన్‌తో కలసి శాంతినగర్‌లో బోరు బండికి పూజలు చేసి డ్రిల్లింగ్‌ ప్రారంభించారు. చైర్మన్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో బోర్లు వేసి, మోటార్లు బిగించి, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. శాంతినగర్‌లో 450 అడుగుల లోతులో నీరు పుష్కలంగా వస్తోందని తెలిపారు. వర్షాలతో భూగర్భజలాల మట్టం పెరిగిందని, నీటి సమస్య ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ రమేష్‌రెడ్డి, ఏఈ కృష్ణకుమార్‌, వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Actions without water problem in summer in Punganur -Chairman Aleem Basha

Natyam ad