Activities under the anti-life legislation on chickenpox

కోడిపందేలపై జీవహింస నిరోధక చట్టం కింద చర్యలు

పందెంరాయుళ్లను హెచ్చరించిన కలెక్టర్ కాటంనేని భాస్కర్‌

Date:11/01/2018

ఏలూరు ముచ్చట్లు:

జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా కోడిపందేలు, బెట్టింగులు నిర్విహించే వారిపై 1960 జీవహింస నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిబంధనలకు విరుద్దంగా కోడిపందేలు, బెట్టింగులు, అక్రమసారా విక్రయం వంటి అసాంఘిక కార్యక్రమాలను నిరోధించేందుకు అవి నిర్వహించే అవకాశమున్న ప్రాంతాలలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అనుమతి లేకుండా 5గురు అంతకుమించి వ్యక్తులు గుమిగూడి ఉండరాదని, నిబంధనకు విరుద్దంగా కోడిపందేలు, బెట్టింగులు, అక్రమసారా అమ్మకాలపై నిషేధం, తదితర అంశాలపై సమస్యాత్మక గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అథికారులను కలెక్టరు ఆదేశించారు. అంతేకాక వీటిని నిరోదించేందుకు మండల స్థాయి జాయింట్‌ యాక్షన్‌ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు వాటి పరిథిలోని గ్రమాలలో నిబంధనలకు విరుద్దంగా కోడిపందేలు, బెట్టింగులు, అక్రమసారా విక్రయం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వెంటనే సంబంధిత అథికారులకు తెలియజేస్తారని, రెవెన్యూ, పోలీసు అథికారులు ఆయా ప్రదేశాలపై నిఘా ఏర్పాటుచేసి కోడిపందేలు, బెట్టింగులు జరిగితే నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తారన్నారు. గ్రామ ప్రాంతాలలోని విఆర్‌ఒలు, పంచాయితీ కార్యదర్శులు వారి ప్రాంతాలలో పటిష్టమైన నిఘా పెట్టి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలపై నివేదికను జాయింటు యాక్షన్‌ బృందాలకు తెలియజేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్‌ పికెటింగ్‌లు, నిఘా కెమెరాలతో చెక్‌పోస్టులు, ఏర్పాటుచేయాలని పోలీసు అథికారులను కలెక్టరు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా కోడిపందేలు నిర్వహణను ప్రోత్సహిస్తూ ప్రసంగాలు చేయడం నేరమని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతాలను దగ్గరలోని పోలీసు అథికారులకు తెలియజేయాలని ప్రజలకు, మీడియాకు కలెక్టరు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా కోడిపందేలూ, బెట్టింగులు, అక్రమ సారా విక్రయాలు జరిగితే సంబంధితాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఎవరు అజాగ్రత్తగా వ్యవహరించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని కలెక్టరు హెచ్చరించారు.

Tags : Activities under the anti-life legislation on chickenpox

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *