ఆదిత్యహృదయం పారాయణం

తిరుమల ముచ్చట్లు:
 
ఆదివారము ప్రత్యక్షదైవం సూర్యనారాయణ స్వామి యిష్టమైన రోజు స్వామి వారికి సూర్య నమస్కారములు చేయాలి ఆదిత్యహృదయం పారాయణం చేయాలి పాయసం నీవేదించాలి తిరుమల బాటగంగమ్మ గుడిలో సూర్యనారాయణ స్వామి దర్శించి ప్రదక్షిణం చేసిబటగంగామామ్మవారిని భజించి మీకు
మీ హితులు సన్నిహితులు శ్రేయాయోబిలాషులు అందరికి శుభం కలగాలని కోరుకుoటూ
ఓం నమో మాత్రే బాటగంగమ్మ ఆశిశులతో
సర్వేజన సుఖినో భవంతు లోకం సామస్తం సుఖినో భవ౦తు మమ.
శుభమ్
Kandhukuri valmiki Narendra Boonmama
సూర్యుడు (జ్యోతిషం)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే
జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు.
లింగం:- సూర్యుడు పురుష గ్రహం.
స్వభావం:- సూర్యుని స్వభావం పాప స్వభావం.
రాశి చక్రంలో స్థితి:- సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
ఇతర నామాలు:- సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.
జాతి:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని జాతి క్షత్రియ,
తత్వం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని తత్వం అగ్ని,
వర్ణం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని వర్ణం రక్తవర్ణం,
గుణం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని గుణం రజోగుణం,
గ్రహతత్వం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం,
రుచి:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,
గ్రహ స్థానం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్థానం దేవాలయం,
జీవులు:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,
గ్రహోదయం:- పృష్టోదయం,
ఆధిపత్య దిక్కు :_ తూర్పు,
జలభాగం:- నిర్జల,
లోహం:- రాగి,
పాలనా:- శక్తి రాజు,
ఆత్మాధికారం:- ఆత్మ, శరీర
ధాతువు:- ఎముక,
కుటుంభ సభ్యుడు:- తండ్రి,
గ్రహవర్ణం:- శ్యాల వర్ణం,
గ్రహ పీడ:- శిరోవేదన, శరీర తాపం,
గృహంలో భాగములు:- ముఖ ద్వారం, పూజా మందిరం,
గ్రహ వర్గం:- గురువు,
కాల బలం:- పగటి సమయం,
దిక్బలం:- దశమ స్థానం,
ఆధిపత్య కాలం:- ఆయనం,
శత్రు క్షేత్రం:- మకరం, కుంభం,
విషమ క్షేత్రం:- వృశ్చికం, ధనస్సు, మకరం.
మిత్రక్షేత్రం:- మీనము.
సమ క్షేత్రం:- మిధునం, కన్య.
సూర్యుడు సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ, మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛలోను, తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను పొందుతుంది. *మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు.
శత్రు గ్రహాలు:- శుక్రుడు, శని.
సమ గ్రహం:- బుధుడు.
నైసర్గిక బల గ్రహం:- శుక్రుడు,
వ్యధా గ్రహం:- శుక్రుడు.
దిన చలనం:- 1 డిగ్రీ.
ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,
రాశిలో ఫలమిచ్చే భాగం:- మొదటి భాగం,
ఋతువు:- గ్రీష్మ ఋతువు,
గ్రహ ప్రకృతి:- పిత్తము.
దిక్బలం:- దక్షిణ దిక్కు.,
‍* పరిమాణం:- పొడుగు,
సూర్య గ్రహ గుణగణాలు
సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే, పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.
సూర్యుని ప్రభావం
సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.
కారకత్వములు
సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు.
రాశులు సూర్యుడు
సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం, మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు.
సూర్యుడు గ్రహాలు
సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే.
సూర్య ఆరాధన
సూర్యుడు తెలుగు సంవవత్సరం ప్రభవ మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిథి, కశ్యపులకు జన్మించాడు కనుక సూర్యునికి రథసప్తమి నాడు విశేష పూజలు జరుపుతారు. సూర్యుడి పూజార్ధం రాగి విహగ్రహం ప్రతిష్ఠిస్తారు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్యర్ధం బెల్లం కలిపిన అన్నం సమర్పిస్తారు. సూర్యుడికి పళ్ళు లేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు సప్త వర్ణాలకు ప్రతీకగా సప్త అశ్వములు పూన్చిన రథం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యుడికి సారథి. అనూరుడు గరుత్మంతుని అన్న. శ్రీరామ నవమి సూర్య గ్రహ ప్రీత్యర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యుడికి ప్రీతికరమైన తిథి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని వివిధరకాలుగా స్త్రోత్రం చేస్తారు. వాటిలో కొన్ని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళి మొదలైనవి. సూర్యుని ప్రీత్యర్ధం విష్ణుసహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తారు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష. జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యునికి ప్రతి రోజు త్రి సంధ్యలలో సంధ్యా వందనం చేయడం హిందూ సంప్రదాయాలలో ఒకటి.
ద్వాదశభావాల్లో సూర్యుడు
ద్వాదశస్థానాలలో రవి
ఆధ్యాత్మిక రంగంలో సూర్యుడు
 
Tags: Aditya heart recitation

Natyam ad