Adjutant into 'Anonymous' pick a new profile!

‘అజ్ఞాతవాసి’లోకి అన్నయ్య.. తేజు కొత్త ప్రొఫైల్‌ పిక్‌!

సాక్షి

Date :09/01/2018

హైదరాబాద్‌: త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ’అజ్ఞాతవాసి’ బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అజ్ఞాతవాసి’ ఫీవర్‌ అభిమానుల్ని ఊపేస్తోంది. అభిమానులు ఇదే అంశంపై పోటాపోటీగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్‌లో పవన్‌ కల్యాణ్‌తోపాటు చిరంజీవి కూడా దర్శనమివ్వడం గమనార్హం. అయితే, ఇది ఒరిజినల్‌ పోస్టర్‌ కాదని తెలుస్తోంది. ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలోని చిరు పోజును.. అజ్ఞాతవాసి పోస్టర్‌లో అభిమానులే ఫొటోషాప్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.ఈ పోస్టర్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పలువురు అభిమానులు ఈ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకోగా.. తాజాగా మెగాహీరో, చిరంజీవి, పవన్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఈ ఫొటోను షేర్‌ చేసుకున్నారు. న్యూప్రొఫైల్‌ పిక్‌ అంటూ ఈ పోస్టర్‌ను తేజు ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నారు.

View image on Twitter

Tags : Adjutant into ‘Anonymous’ pick a new profile!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *