Advocate Prakash was honored during World Maternity Day

ప్రపంచ మాతృబాష దినోత్సవ సందర్భంగా న్యాయవాది ప్రకాష్‌కు సన్మానం

Date:21/02/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రపంచ మాతృబాషదినోత్సవ సందర్భంగా పుంగనూరు న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌కు సన్మానం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో గోకుల్‌ కళ్యాణ మండపంలో మాతృబాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2012 సంవత్సరం నుంచి తెలుగుబాషలో దావాలు దాఖలు చేస్తున్న న్యాయవాది ప్రకాష్‌కు శ్యాలువకప్పి సన్మానించారు. అలాగే గ్రంధాలయ కార్యాలయంలో గ్రంధాలయ డైరెక్టర్‌ ప్రకాష్‌ , విశ్రాంత ఉద్యోగులు రవీంద్ర, వెంకటపతి,రామలింగప్ప, ప్రభాకర్‌, లయన్స్క్లబ్‌ ప్రతినిధులు ఇంతియాజ్‌, గిరి, వెంకటేష్‌లు కలిసి న్యాయవాది ప్రకాష్‌కు సన్మానం చేశారు. తెలుగుబాష అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అన్ని రంగాల్లోను తెలుగును వినియోగించాలని న్యాయవాది ప్రకాష్‌ కోరారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్‌ అధికారులు మనోహర్‌, రామక్రిష్ణరావు, వెంకట్రామయ్య, గ్రంధాలయ అధికారులు సుబ్బమ్మ,షహనాజ్‌, పట్టణ యూత్‌ మర్రిబాబు, సుధీర్‌, కుమార్‌, రాజా తదితరులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Advocate Prakash was honored during World Maternity Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *