మళ్లీ అమాత్యుల పదవుల ఆశలు

Date:17/03/2018
అనంతపురం ముచ్చట్లు:
మంత్రి పదవులపై మళ్లీ చర్చ మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బిజెపి ఇటీవలే బయటకు వెళ్లింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలను భర్తీ చేస్తారన్న ప్రచారం ఇటీవల సాగుతోంది. ఇందులో ఎవరికి స్థానముండవచ్చన్న చర్చ అధికార పార్టీ నాయకుల్లో మొదలైంది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఎవరికి ఛాన్సు లభిస్తుందన్న దానిపై ప్రధాన చర్చ నడుస్తోంది. ఇందులో టిడిపికి బలమైన జిల్లాగా ఉన్న అనంతపురం జిల్లాకే ప్రాధాన్యత కల్పించవచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణ సమయంలో ముగ్గురికి జిల్లాలో స్థానం లభిస్తుందని ప్రచారం సాగింది. ఇప్పుడు ఖాళీపడిన మంత్రివర్గ స్థానాలతోపాటు మైనార్టీ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉంది. ఇటీవలి కాలంలో మైనార్టీ శాఖను మైనార్టీకి చెందిన నేతలకు ఇవ్వాలన్న పలువురు మైనార్టీ సంఘాల నుంచి డిమాండ్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో అత్తార్‌ చాంద్‌బాషాకు ఛాన్సు ఉంటుందా అన్నది చర్చసాగుతోంది. పార్టీలో సీనియర్‌ అయిన షరీఫ్‌కు ఇవ్వాలని కొంత మంది డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఆయన కాని పక్షంలో వైసిపి పార్టీలో గెలుపొంది, టిడిపిలో వచ్చిన చాంద్‌బాషాకు ఇవ్వాలని కొంత మంది మైనార్టీలు అడుగుతున్నారు. ఇదిలాఉంటే ఖాళీపడిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి పదివి జిల్లాకు చెందిన నేతలకే ఇవ్వొచ్చు అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి రెండుసార్లు పేరు ఖారారైందని పెద్దఎత్తున ప్రచారం సాగిన పయ్యావుల కేశవ్‌ పేరు మరోమారు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమీస్తున్న తరుణంలో ఆయనకు చోటు కల్పించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసిపికి గట్టిగా జవాబు చెప్పించేందుకు దోహపడతుందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయనకు ఇప్పటికీ మండలి చీఫ్‌విప్‌ ఇచ్చి క్యాబినేట్‌ హోదా కల్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించి మంత్రివర్గంలో మార్పులు చేపట్టే సూచనలున్నాయని అభిప్రాయం వ్యక్లమవుతోంది. అయితే గత మంత్రివర్గ విస్తరణం సమయంలో బికె.పార్థసారధి పేరు దాదాపుగా ఖరారై చివరి నిమిషంలో మార్పు జరిగిన విషయం తెలిసిందే. ఏదైనా చేరికలుంటే ఆయన కూడా గట్టిగా అడిగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఏడాది సమయంలో మంత్రివర్గంలో చోటుకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే ఇది జరుగుతాయా లేక అలాగు కొనసాగుతాయో చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమి జరుగుతుందో ఎవరూ ముందుగా ఊహించలేని పరిస్థితులు కూడా నెలకొని ఉంది..
Tags: Again the ambitions of amateurs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *