లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అగనంపూడి ఆర్ఈసిఎస్ విద్యుత్ ఉద్యోగులు.

అనకాపల్లి   ముచ్చట్లు:
విశాఖజిల్లా గాజువాక అగనంపూడి ఆర్ఈసిఎస్ విద్యుత్ కార్యాలయంలో సోమవారం ఏసిబి అధికారులు దాడులు చేశారు.అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో ఒక అపార్టమెంట్ కు ఎలక్ట్రికల్ మీటర్లు అనుమతులు కొరుకు  ఆర్ఈసిఎస్ ఏఈ బుద్దా ప్రసాద్ , ల్తెన్ ఇన్ స్పెక్టర్ రమేష్ డబ్బులు డిమాండ్ చేసారు.ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్ ఓనర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనితో సోమవారం ఉదయం 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు ఏఈ బుద్దా ప్రసాద్ , లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ పట్టుబడ్డారు.ఆర్ ఈ సి ఎస్ కార్యాలయంలో  ఏసిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీడీఎస్పీ పి బి వి ఎస్ ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ దాడుల్లో సిఐలు లక్ష్మణమూర్తి, కిషోర్, గఫూర్ , ఎస్సైలు విజయకుమార్ , శ్రీనివాస్ పాల్గొన్నారు.
 
Tags:Aganampudi RECS electrical employees caught in ACB taking bribe

Natyam ad