భాగ్య నగరానికి అగ్రతాంబులం

హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌కు అగ్రతాంబూలం దక్కింది. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లు కేటాయించారు. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్లతో సర్వీసు రోడ్డు నిర్మాణానికి కేటాయించారు. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువు అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్‌ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని హరీష్‌రావు వెల్లడించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 2లక్షల 56వేల 958.51 కోట్ల రూపాయల బడ్జెట్
రెవెన్యూ వ్యయం 1, 89,274. 82 కోట్లు.
క్యాపిటల్ వ్యయం 29, 728.44 కోట్లు
తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు
పన్ను ఆదాయం – రూ.1,08,212 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా – రూ.18,394 కోట్లు
పన్నేతర ఆదాయం – రూ.25,421 కోట్లు
గ్రాంట్లు – రూ.41,001 కోట్లు
రుణాలు – 53,970 కోట్లు
అమ్మకం పన్ను అంచనా – రూ.33 వేల కోట్లు
ఎక్సైజ్ ద్వారా ఆదాయం – రూ.17,500 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం – రూ.15,600 కోట్లు
బడ్జెట్ 2022-23 కేటాయింపులు
నీటి పారుదల రంగానికి రూ.22,675 కోట్లు
ఆసరా పింఛన్ల పథకానికి రూ.11,728 కోట్లు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రూ.2,750 కోట్లు
9,123 స్కూళ్లలో మన ఊరు – మనబడికి రూ.3,497 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు
ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ.177 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.5,698 కోట్లు
ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లు
బడ్జెట్ 2022-23 కేటాయింపులు
దళిత బంధుకు రూ. 17,700 కోట్లు
దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800 కుటుంబాలకు లబ్ధి
వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు
హరిత హారానికి రూ.932 కోట్లు
పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
కొత్త వైద్య కళాశాలలకు రూ.వెయ్యి కోట్లు
మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలు
సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం
తెలంగాణలో పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, ఇందుకు రూ.వెయ్యి కోట్లు
రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యం
రూ.50 వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ
వచ్చే ఆర్థిక ఏడాది నుంచి రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
మొత్తం పంట రుణాలు రూ.16,144 కోట్లు మాఫీ
విడతల వారీగా 5.12 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ ద్వారా లబ్ధి
తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్‌ రాజీలేని వైఖరిని అవలంభించిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యుత్ సంస్కరణలు రైతుల పాలిట గొడ్డలి పెట్టని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతుల నుంచి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని షరతు పెట్టింది. అది తెలంగాణ ప్రభుత్వ విధానం కానేకాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రైతు బిడ్డ పాలిస్తున్న ప్రభుత్వం. అంతా శుష్కప్రియాలు.. శూన్య హస్తాలే అన్నారు. పన్నుల రూపంలో 41 శాతం తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. కానీ దొడ్డి దారిన పన్నులు వసూలు చేస్తోంది. కేంద్రం ఈ నిర్వాకాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుబట్టిందని మంత్రి హరీష్ రావు.కరోనాతో సంక్షోభం ఎదురైనా కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కంటితుడుపుగా షరతులతో కూడిన రుణ పరిమితి పెంచింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చలేదని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు.పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రస్తుత పాలకులు అంటున్నారు. ఏ విషయంలోనూ కేంద్రం సహకారం లేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్‌ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసింది. కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం లేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు అరంభం నుంచి కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు.. ‘ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. రాజకీయ, సామాజిక అసమానతల నుంచి స్వరాష్ట్రంగా అవతరించింది. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా తెలంగాన దూసుకుపోతుంది. ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్. ఇప్పుడు తెలంగాణ వ్యవహరిస్తున్నది.. రేపు భారత్ అనుసరిస్తోంది.’’ అని హరీష్ రావు అన్నారు.
రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ
రాష్ట్ర రైతులకు తీపి వార్త చెప్పింది తెలంగాణ సర్కార్.  రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.25 వేలు, రూ.50 వేలు ఉన్నవారిలో కొందరికే మాఫీ జరిగింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. రూ.50వేల లోపు రైతు రుణాలు మార్చిలోపు మాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మొత్తంగా రూ.16,144 కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తామని, దీనిద్వారా 5.12లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తోంది. ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో సర్కార్ జమచేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసినట్లు వివరించారు. గతేడాది వ్యవసాయ రంగానికి రూ.25వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది(2022-23)కి రూ.24,254 కోట్లు ప్రతిపాదించింది.  తెలంగాణ ప్రభుత్వం రైతలకు అండగా ఉంటుందని చెప్పిన మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
 
Tags:Agratambulam to the city of fortune

Natyam ad