Agriculture has become a scam: BJP MLA Kishan Reddy

వ్యవసాయం దండగా మారింది : బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

Date:13/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అనే దశకు వస్తుందనుకుంటే దండుగగా మారుతోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. కంది  రాష్ట్రంలోఎంత విస్తీర్ణంలో సాగైందో, ఎంత ఉత్పత్తి రాబోతందన్న విషయంపై స్పష్టత లేదు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కేంద్రమే కొనుగోలు చేయాలన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతులకు ఇస్తున్న ఎకరానికి 4వేల రూపాయలు ఆన్ లైన్ ద్వారా ఇవ్వడంలేదో చెప్పాలి. నాలుగేళ్లు పూర్తికావస్తున్నా… పూర్తిగా రుణమాఫీ జరగలేదని అయన విమర్శించారు. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. కేద్రం విద్యార్థులకు అందిస్తున్న ఉపకార వేతనాల నిధులను కూడా ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తోంది.  వైద్యులు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలల గుర్తింపు రద్దయ్యే దుస్థితి దాపురించిందని అన్నారు. ఉద్యోగులకు నాలుగేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. పార్లమెంట్ రూపొందించిన చట్టపరిధిలోనే గ్రామపంచాయతీలకు నిధులు అందించవచ్చు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించారని అన్నారు. కేంద్ర బడ్జెట్ ను విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వం పనితీరును సరిచేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2లక్షల ఇండ్లు మంజూరు చేసింది. వాటిలో ఎన్ని నిర్మించిందో ప్రభుత్వం స్పష్టం చేయాలి.  కేసీఆర్ ప్రభుత్వం ఈవెంట్స్ ప్రభుత్వం. ప్రగతి భవన్ ను ముఖ్యమంత్రి తెరాస కార్యాలయంగా భావిస్తోందని అన్నారు.
Tags: Agriculture has become a scam: BJP MLA Kishan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *