రన్వే పక్కకు దూసుకెళ్లిన విమానం..

ధిల్లీ: మధ్యప్రదేశ్ లోని జబల్పుర విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నించిన ఓ విమానం.. పెను ప్రమాదం నుంచి బయటపడింది. ల్యాండింగ్ సమయంలో ఏటీఆర్-72 విమానం.. రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారని… అయితే ఎవరూ గాయపడలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. ఈ విమానాన్ని అలయన్స్ ఎయిర్ సంస్థ నడిపిస్తోంది. ఢిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 1.15 గంటలకు జబల్పుర్ వచ్చిన క్రమంలో ఇది ప్రమాదానికి గురైంది. ప్రమాదం అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు..

Natyam ad