Airtel Reliance Jio

ప్లాన్ల అప్‌డేట్‌లో బిజీబిజీగా ఎయిర్‌టెల్‌

సాక్షి

Date :22/01/2018

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ జియోకు పోటీగా తన ప్యాక్‌లను అప్‌డేట్‌ చేస్తూ.. బిజీబిజీగా మారిపోయింది. తాజాగా మరో రెండు ప్యాక్‌లను ఎయిర్‌టెల్‌ అప్‌డేట్‌ చేసింది. ఒకటి రూ.399 ప్లాన్‌. మరొకటి 149 రూపాయల ప్యాక్‌. ఎయిర్‌టెల్‌ 399 రూపాయల ప్యాక్‌ వాలిడిటీని 70 రోజుల నుంచి 84 రోజులకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో ఈ ప్యాక్‌పై 84 రోజుల పాటు రోజుకు 1జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందివ్వనుంది. 28 రోజుల వాలిడిటీగా ఉన్న ఈ ప్యాక్‌ను ఇటీవలే 70 రోజులకు పెంచింది. తాజాగా ఈ ప్యాక్‌ వాలిడిటీని 84 రోజులకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో తన ప్రత్యర్థి రిలయన్స్‌ జియో రూ.398 ప్యాక్‌కు గట్టి పోటీగా నిలువబోతున్నట్టు తెలుస్తోంది. జియో ప్యాక్‌ వాలిడిటీ 70 రోజులు మాత్రమే.

అదేవిధంగా అప్‌డేట్‌ చేసిన 149 రూపాయల ప్యాక్‌పై ఇక నుంచి రోమింగ్‌పై కూడా అపరిమిత కాల్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. ఈ ప్యాక్‌పై ఇప్పటి వరకు ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు మాత్రమే అపరమిత కాల్స్‌ను ఆఫర్‌ చేసేది. ఇక ఈ అప్‌డేషన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ, రోమింగ్‌ కాల్స్‌ను చేసుకోవచ్చు. అంతేకాక 28 రోజుల పాటు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను వాడుకోవచ్చు. కానీ ఈ ప్యాక్‌ వాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఈ ప్యాక్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్లలో కొన్ని రీజన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *