ఏఐటీయూసి ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
 
తెలంగాణ కు ఆస్తిత్వ చిహ్నమైన సింగరేణి లోని నాలుగు బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య  పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణి మనుగడకే ముప్పు తెచ్చేలా సింగరేణి ప్రైవేటికరణను చేపట్టి సంపన్న వర్గాలకు అందలం ఎక్కించాలని చూస్తుందని ప్రత్యేకంగా పరోక్షంగా కొన్ని వేలమంది కి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి ని ప్రైవేటికరణ చేయాలన్న  నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు
 
Tags: AITUC Dharna

Natyam ad