పెందుర్తి నియోజకవర్గాన్ని కొనసాగించాలని అఖిలపక్షం ర్యాలీ

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లాలో పెందుర్తి కొనసాగించక పోతే రానున్న రోజుల్లో  ఉద్యమం చేస్తామని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేసారు. అనకాపల్లి వద్దు విశాఖ ముద్దు అంటూ అఖిలపక్ష నాయకులు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం నుంచి విశాఖ కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ గా బయల్దేరారు. ముందుగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో అఖిలపక్ష నాయకులు విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కొనసాగించాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కొనసాగించాలని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరి అభిప్రాయాలు సంతకాలు సేకరించి అఖిలపక్ష  సమక్షంలో ఈరోజు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని గుర్తుచేశారు. విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని కొనసాగించక పోతే రానున్న  రోజుల్లో అఖిలపక్ష నాయకులతో  ఉద్యమం చేస్తామన్నారు. పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లా లో కాకుండా అనకాపల్లి లో చేర్చితే ఇక్కడ ప్రజలు లు స్థానికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతారని వామపక్ష నాయకులు గుర్తుచేశారు. ఈ ర్యాలీ లో వామపక్ష నాయకులు పాల్గొన్నారు.
 
Tags: Akhilapaksa rally to continue Pendurthi constituency

Natyam ad