Alcohol is a new year

కొత్త ఏడాదికి ఏరులై పారిన మద్యం

Date: 03/01/2018

నల్గొండ ముచ్చట్లు:

కోటి ఆశలతో కొత్త ఏడాది వచ్చేసింది. పాత సంవత్సరానికి గుడ్‌ బై చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంజాయ్‌ చేశారు. యువతరం అయితే ఫుల్‌ జోష్‌లో మునిగిపోయారు. అందరి సంగతి ఓకే కానీ మందుబాబులయితే మత్తులో మునిగి తేలారు. న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు పీకలదాకా తాగేశారు. ఇందుకు డిసెంబర్‌ 31, జనవరి ఫస్టున జరిగిన మద్యం అమ్మకాలే సాక్ష్యం. ఇరు రాష్ట్రాల్లో కలిపి ఈ రెండు రోజుల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 170కోట్ల రుపాయల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ఇంతే కాదు జనవరి ఫస్ట్‌న ఏకాదశి పర్వదినం రాకుంటే మద్యం అమ్మకాలు భారీగా పెరిగి ఉండేవని ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు. అదే పండగ లేకుంటే మందుబాబులు జనవరి ఫస్ట్‌ రోజున కూడా మత్తులో మునిగితేలేవారు. నూతన ఏడాది ప్రారంభం రోజునే ఏకాదశి రావటంతో ఆదాయానికి గండి పడిందని కొందరు వ్యాఖ్యానించారు.ఏడాది తొలిరోజునే ఏకాదశి పర్వదినం రావటంతో మందుబాబులు కూడా చాలా బాధపడ్డారట. పండగే లేకుంటే పండుగ చేసుకుని ఉండేవారమని తెగ ఫీలయ్యారట.

Tags: Alcohol is a new year

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *