చట్టం ముందు అందరు సమానమే- న్యాయమూర్తి సిందు

పుంగనూరు ముచ్చట్లు:
 
సమాజాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చట్టాల ముందు ప్రతి ఒక్కరు సమానమేనని , ఎలాంటి తేడాలు ఉండవని జూనియర్‌ సివిల్‌ జడ్జి సిందు తెలిపారు. శనివారం ఆమె మండలంలోని ఈడిగపల్లెలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు తగిన ఆధారాలు ఉండాలన్నారు. భూమి తమకు చెందిందని , దీనిపై హక్కు ఉందని కేసులో దావాలు వేస్తుంటారని, అలాంటి సమయంలో హక్కులకు సంబంధించిన రికార్డులు ఉండాలన్నారు. అలాగే విద్యాహక్కు తో పాటు బాల్య వివాహాలు నిషేధించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి , బాధ్యతలు గుర్తించిన రోజున సమస్యలు ఉత్పన్నంకావని తెలిపారు. మార్చి 12న నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకునేందుకు ప్రజలు ముందుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వీరమోహన్‌రెడ్డి, సమివుల్లా, సర్పంచ్‌ సుధాకర్‌, కోఆఫ్షన్‌ మెంబరు బావాజాన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, కార్యదర్శులు పురుషొత్తంరెడ్డి , లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 
Tags; All are equal before the law- Judge Sindhu

Natyam ad