ఏఐడిఆర్ఎఫ్ నియోజకవర్గ స్థాయి కమిటీ ఏర్పాటు

పలమనేరు ముచ్చట్లు :
అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య నియోజకవర్గ స్థాయి కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు తెలిపారు. స్థానిక బాపూజీ ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏఐడిఆర్ఎఫ్ సభ్యుల సమక్షంలో నియోజకవర్గ స్థాయి కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇందులో నియోజకవర్గ అధ్యక్షుడిగా శ్యాంసుందర్, పట్టణ అధ్యక్షుడిగా వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా గంగవరం రమణ, కోశాధికారులుగా డ్రైవర్స్ కాలనీ రవి, గోపాల్, కార్యదర్శులుగా వెంకటేశ్,స్వామిదొరై, చంద్రమోహన్ లు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐడిఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త సుధాకర్, ఉప ప్రధాన కార్యదర్శి కె. చిన్న, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.
Tag: All India , Dalit Rights Association,  (AIADF) constituency level committee.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *