All the best .. Jagan Anna: Surya

ఆల్‌ ది బెస్ట్‌ .. జగన్‌ అన్నా: సూర్య

సాక్షి

Date :15/01/2018

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన-ఆశయాలతోనే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని ప్రముఖ నటుడు సూర్య తెలిపారు. అందుకోసం కష్టపడేతత్వం వైఎస్‌ జగన్‌కి ఉందని ఆయన అన్నారు.

కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే తనకు వైఎస్‌ఆర్‌ కుటుంబంతో పరిచయం ఉందని సూర్య చెప్పారు. వైఎస్‌ జగన్‌, తాను కలుసుకొని మాట్లాడినప్పుడు రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని.. అయినా ప్రజలకు ఏదో చేయాలన్న తపన వైఎస్‌ జగన్‌ లో గమనించానని సూర్య అన్నారు. మహానేత, దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని కోల్పోవడం తీరని లోటని చెప్పారు. రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చాలా ప్రాధాన్యం కలిగిందని.. ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా అదే తరహాలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సూర్య పేర్కొన్నారు.

Tags: All the best .. Jagan Anna: Surya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *