ఆలయాల అభివృద్దికి నిధుల కేటాయింపు-మంత్రి వెల్లంపల్లి

విజయవాడ ముచ్చట్లు:
 
రాష్ట్రంలో హిందూ ఆలయాల అభివృద్ధి కోసం నిధులను సీఎం జగన్ కేటాయిస్తున్నారని దేవా దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీని వాసరావు తెలిపారు. ఇంద్రకీలాద్రి పై ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిం చి సమీక్ష జరిపారు.అనంతరం ఆయ న మాట్లాడుతూ దుర్గగుడి అభివృద్ధి పనులపై ఈ రోజు సమీక్ష చేశామ న్నారు. పనుల వివరాలపై దేవాదాయ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. సీఎం అడిగిన వెంటనే దుర్గగుడికి నిధులు కేటాయిం చారని ఆయన పేర్కొన్నారు.అప్పుడ ప్పుడు కొండ చరియలు పడుతయ న్నాయన్నారు.ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడ తామని ఆయన తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వమూ ఆలయానికి నిధులు ఇవ్వలేదన్నారు.సాధ్యమైనంత త్వర గా పనులు పూర్తి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
Tags: Allocation of funds for temple development – Minister Vellampally

Natyam ad