Date: 09/12/2017
పలమనేరు ముచ్చట్లు
కొరియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నేడు పలమనేరుకు చేరుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ్ రెడ్డికి తెదేపా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక తెదేపా కార్యాలయంలో జిల్లా తెదేపా కోశాధికారి ఆర్వీ బాలాజి, మైనారిటీ నాయకులు మంత్రిని కలిసి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మైనారిటీ నాయకులతో షాదీమహల్ మరమ్మత్తులపై చర్చించారు. దండపల్లి రోడ్డువద్ద గల జామియా మసీదు అభివృద్ధికి రూ. 20 లక్షలతో మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ మేరకు అంచనా నివేదికను ప్రభుత్వానికి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు మత పెద్దలు షౌకత్ భాషా, అమానుల్లా, ఖాకా తదితరులు పాల్గొన్నారు.
Tag: Amar, who arrived at Palamana, ending the Korea visit