Amaranth Reddy, who is working on rubber stamp in the hands of Chandrababu and Lokesh, has not been brought to the house of the Minister for Industries and Industries. - Vaikappa leaders Peddireddy Ramachandra Reddy, Arke Roja Dwas.

చంద్రబాబు, లోకేష్ ల చేతిలో రబ్బర్ స్టాంప్ లా పని చేస్తున్న మంత్రి అమరనాథ్ రెడ్డి

Date:11/12/2017
 – పేరుకే పరిశ్రమల శాఖా మంత్రి, సొంత ఊరికి ఒక్క పరిశ్రమా తీసుకురాలేదు. 
– వైకాపా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ద్వజం.
పలమనేరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ ల చేతిలో  మంత్రి అమరనాథ్ రెడ్డి రబ్బరు స్టాంప్ లా పనిచేస్తున్నాడని వైకాపా నాయకులు పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రి అమరనాథ్ రెడ్డి తీరును దుయ్యబట్టారు. పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో వైసీపీ నాయకుడు ఆకుల గజేంద్ర ప్రసాద్ చే నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. తొలుత వారు స్థానిక మూడురోడ్ల కూడలిలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గుడుయాత్తం రోడ్డువద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్టానికి పెట్టుబడులు తీసుకురావాలని కొరియాకు  వెళ్ళిన చంద్రబాబు బృందం ఇక్కడ దోచుకున్న డబ్బుని అక్కడ దాచుకుని తిరిగి వచ్చారని ఆమె ఎద్దేవా చేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ అభిమానుల ఓట్లతో పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రాజ్యాంగ విరుద్దంగా, నిస్సిగ్గుగా పార్టీ మారి నేడు మంత్రిగా కొనసాగడం నీతిమాలిన చర్యగా ఆమె పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగేళ్ళు గడుస్తున్నా సంతలో పశువుల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని పెద్దిరెడ్డి విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలతో విరిగిపోయిన ప్రజలు రానున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  చంద్రబాబుకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ ని బలోపేతం చేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కానుకగా ఇస్తామన్నారు. ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు. తమ పార్టీలో వర్గ విభేదాలు లేవని, వైసీపీ అభ్యర్థులను గెలుపించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, నియోజకవర్గ సమన్వయకర్తలు రాకేష్ రెడ్డి, సీవీ కుమార్,  రాష్ట్ర కార్యదర్శులు విజయభాస్కరరెడ్డి, మొగసాల క్రిష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ, జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చెంగారెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శి సుహేబ్, మండల కన్వీనర్లు మండీ సుధ, బాలాజీనాయుడు, బాగారెడ్డి, బాలగురునాథం, మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tag: Amaranth Reddy, who is working on rubber stamp in the hands of Chandrababu and Lokesh, has not been brought to the house of the Minister for Industries and Industries. – Vaikappa leaders Peddireddy Ramachandra Reddy, Arke Roja Dwas.

Amaranth Reddy, who is working on rubber stamp in the hands of Chandrababu and Lokesh, has not been brought to the house of the Minister for Industries and Industries. - Vaikappa leaders Peddireddy Ramachandra Reddy, Arke Roja Dwas.
Amaranth Reddy, who is working on rubber stamp in the hands of Chandrababu and Lokesh, has not been brought to the house of the Minister for Industries and Industries. – Vaikappa leaders Peddireddy Ramachandra Reddy, Arke Roja Dwas.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *