అంబానీ టూర్ టార్గెట్ ఏంటీ…

-గోదావరి బేసిన్ పై రిలయన్స్ కన్ను
Date:15/02/2018
విజయవాడముచ్చట్లు:
ఏపీలో పెట్టుబ‌డుల‌కు రిల‌య‌న్స్ అధిప‌తి అంబానీ ముందుకు రావ‌టం స్వాగ‌తించాల్సిందే. కానీ.. ఆయ‌న వ్యాపారి. ఏ లాభం లేకుండా.. అందులోనూ ముందుచూపు లేకుండా కోట్లు కుమ్మ‌రించ‌టం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌నేది.. ఆంధ్ర‌ ప్ర‌జ‌ల అంత‌ర్గ‌త ఆలోచ‌న‌. ఏ అవ‌స‌ర‌మూ లేక‌పోతే.. ఇన్నాళ్ల‌కు రావ‌టం.. 150 ఎక‌రాల్లో శ్రీసిటి నిర్మాణం.. ల‌క్ష‌ల సెల్‌ఫోన్ల త‌యారీ.. వావ్‌.. రిల‌య‌న్స్‌కు గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేందుకు అవ‌స‌ర‌మైన సాధ‌నా సంప‌త్తి ఉంది. అంత‌ర్జాతీయ స్థాయిలో అమెరికా, జ‌ర్మ‌నీల త‌రువాత అంత‌టి టెక్నాలజీ రిల‌య‌న్స్ సొంతం. నిర్మాణ రంగంలో ఎల్ అండ్ టీ ఎంత స్థాయి ఉందో.. స‌ముద్ర తీర ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాల‌ను గుర్తించ‌టం, వెలికితీయ‌టంలో రిల‌య‌న్స్ ఇప్పుడు టాప్‌, వైఎస్ సీఎంగా వున్న‌పుడు కృష్ణా గోదావ‌రి బేసిన్‌లో వున్న గ్యాస్‌ను త‌క్కువ‌కే సొంతం చేసుకోవాల‌ని రిల‌య‌న్స్ ప్లాన్ చేసింద‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఆ స‌మ‌యంలో వాటాల లెక్క‌లో.. ఏపీకు కావాల్సిన లాభాలు.. ప్ర‌జ‌ల‌కు ఉచిత గ్యాస్ఒప్పందాలు.. ఇవ‌న్నీ గుట్టుగా జ‌రిగాయ‌నే గుస‌గుస‌లు లేక‌పోలేదు. ఏదైనా.. అప్ప‌ట్లో సంధి విఫ‌ల‌మైంది. ఆ క్ర‌మంలోనే.. సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణం.. చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీనికి ప‌రోక్షంగా రిల‌యన్స్ సంస్థ‌లే కార‌ణ‌మంటూ జ‌గ‌న్ ప‌త్రిక క‌థ‌నాలు ప్ర‌చురించింది. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వెనుక‌.. ఏదో అజ్ఞాత శ‌క్తి ఉందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఆ క్ర‌మంలోనే రిల‌య‌న్స్ సంస్థ‌లు, దుకాణాల‌పై వ‌రుస దాడులు కూడా జ‌రిగాయి. కొత్త స‌ర్కారు కొలువుదీరాక‌.. అవ‌న్నీ గ‌తంగా మిగిలిపోయాయి. ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు బీజేపీ, టీడీపీల‌కు రిల‌య‌న్స్ స‌హ‌కారం అందించిన‌ట్లు అప్ప‌ట్లో పుకార్లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు బీజేపీ, వైసీపీ చేరువ‌వుతున్న స‌మ‌యంలో అంబానీ స్వ‌యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌మావేశం కావ‌టం.. వెనువెంట‌నే పెట్టుబ‌డుల ముచ్చ‌ట్లు.. చూస్తుంటే.. ఇదంతా ఏదో జ‌రిగేందుకు సంకేత‌మంటూ విశ్ల‌ష‌కులు లెక్క‌లు క‌డుతున్నారు. మ‌రి దీనిపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తార‌నేది చూడాలి.
Tags: Ambani Tour Target Anti …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *