దళిత బహుజనుల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

పలమనేరు ముచ్చట్లు
నవ భారత నిర్మాత డా.భీంరావ్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌ ను భారత దేశ దళిత బహుజనుల ఆశాజ్యోతి గా ఏఐడిఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరబల్లి శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐడిఆర్ఎఫ్ నాయకులు స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐడిఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, కార్యదర్శి చిన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి అంబేడ్కర్‌ 2 సంవత్సరాల 11నెలల 8 రోజులు ఎంతగానో శ్రమిమచారని గుర్తు చేశారు. దళిత బహుజనులు ఐక్యమత్యంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పి.వెంకటేశ్,ప్రధాన కార్యదర్శి బుజ్జి, కార్యదర్శి స్వామి దొరై, సభ్యులు విరాట్,చంద్ర, మధు,రమణ,దాసు,మణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *