కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలి

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
 
భారత రత్న,  రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ దేశ ప్రజలందరి హృదయాలలో కొలువై ఉన్నాడని, ఆయన చిత్ర పటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించి ఆయన గౌరవాన్ని  మరింత పెంచాలని శ్రీ సాయి కృప కళాశాల చైర్మన్  దరిపెళ్ళి ప్రవీణ్ కుమార్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం స్థానిక జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహంకు యాభై తొమ్మిదవ వారంలో భాగంగా జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని చేపట్టిన ఉద్యమం మన జిల్లా నుండే ప్రారంభం కావడం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. ఈ మహా ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
 
Tags; Ambedkar’s photo should be printed on currency notes

Natyam ad