అలలపై అంబులెన్స్

భువనేశ్వర్ ముచ్చట్లు:
 
బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు వ‌చ్చిన ఓ ఐడియా.. వైద్య స‌దుపాయం లేని కొన్ని ప్రాంతాల‌కు తీపి క‌బురు చెప్పింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి, స్వాభిమాన్‌ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద చిత్రకొండ జలాశయం ఉంది.. అందులో తాజాగా బోటు అంబులెన్స్‌ను ప్రారంభించింది బీఎస్ఎఫ్‌.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్‌ఎఫ్‌ డీఐజీ సంజయ్‌కుమార్‌ సింగ్ హాజ‌ర‌య్యారు.. బోటు అంబులెన్స్‌ను ప్రారంభించి.. అక్క‌డి ప్రజలకు అంకితమిచ్చారు.చిత్త‌కొండ‌ జలాశయం మధ్య భూభాగంలోని పనాస్‌పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ క‌ష్టం వ‌చ్చినా.. మ‌రో ప్రాంతానికి వెళ్లాలి.. కానీ, వారికి స‌రైన రోడ్డు మార్గం కూడా లేదు.. దీంతో.. వారికి ప‌డ‌వ ప్ర‌యాణం త‌ప్ప‌.. మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు.. ఇలా.. ఎన్నో సార్లు వారు ప్ర‌మాదాల‌కు గుర‌య్యారు.. ఎంతో మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.. అయితే, ఇది బీఎస్‌ఎఫ్ జ‌వాన్ల దృష్టికి వ‌చ్చింది.. ఎలాగైనా వారి కష్టాలు తీర్చాల‌ని ప్లాన్ చేశారు.. అందులో భాగంగానే బోటు అంబుటెన్స్‌ను రూపుదిద్దుకుంది.. ఇక‌, గణతంత్ర దినోత్సవ కానుకగా ఆ బోటు అంబులెన్స్‌ను ప్రారంభించి వారికి అంకితం ఇచ్చారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Ambulance on the waves

Natyam ad