పోలీసు స్టేషన్ లో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ ముచ్చట్లు:
 
ఓ ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యకు యత్నించాడు.. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.. ఆటో కిరాయి విషయంలో పెద్దదైన గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో.. మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 60 శాతం గాయాలతో ఇప్పుడతని పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెంకటస్వామి అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.. అతనిది దోమకొండ. అయితే ఆదివారం కామారెడ్డిలోని 4వ వార్డు కౌన్సిలర్‌ రవి కామారెడ్డి బస్టాండ్‌ నుంచి రామేశ్వర్‌పల్లికి ఆటోలో వెళ్లేందుకు వెంకటస్వామితో రూ.100కు బేరం కుదుర్చుకున్నాడు. ఆటోలో రామేశ్వర్‌పల్లికి వెళ్లిన తర్వాత రవి రూ.30 మాత్రమే ఇచ్చాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రవి 100 డయల్‌ చేసి వెంకటస్వామిపై ఫిర్యాదు చేశాడు.దీంతో వెంకటస్వామిని కామారెడ్డి పట్టణ పోలీసులు, స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలోనే మనస్తాపం చెందిన వెంకట స్వామి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పేసి కామారెడ్డిలోనే ఓ ఆస్పత్రికి తరలించారు. 60 శాతం గాయాలు కావడంతో వెంకటస్వామి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
 
Tags: Auto driver commits suicide at police station

Auto driver commits suicide at police station
Comments (0)
Add Comment