కోటప్పకొండలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం

-త్రికోటేశ్వర స్వామి పాదాల చెంత కొలువుదీరిన నందీశ్వరుడు
 
కోటప్పకొండ ముచ్చట్లు:
 
పల్నాడుకి మణిహారం లాంటి కోటప్పకొండ అభివృద్ధి మా లక్ష్యం : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి .నరసరావుపేట: మహశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరగనున్న త్రికోటేశ్వర స్వామి తిరుణాళ్లను పురస్కరించుకుని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కోటప్పకొండపై అద్భుత ఘటం ఆవిష్కృతమైంది. పరమేశ్వరుడి దర్శించుకునే ముందు నందిశ్వరుడిని దర్శించుకోవాలని ప్రతితి. అందుకు అణుగుణంగా కొండపైనే త్రికోటేశ్వర స్వామి చెంత 12 అడుగుల ఎత్తుతో ఎకశిలా నంది విగ్రహం ప్రతిష్టా కార్యక్రమంగా ఇవాళ జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి  ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీ క్రేన్ ల సాయంతో ప్రతిష్టాపన కార్యక్రమ జరిగింది. “చేదుకో కోటయ్య చేదుకో”… హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పరమేశ్వరుడిని నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం జరిగింది. వారాంతం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు నంది విగ్రహం వద్ద ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు.ఇప్పటికే కోటప్పకొండ ఘాట్ రోడ్డులో బ్రహ్మ, విఘ్ణ, పార్వతిదేవి, లక్మీ దేవి, సరస్వతి దేవి, విష్నేశ్వరుడి విగ్రహాలు కోలువై ఉన్నాయి. వాటికి పాటు ఈ ఏడాది తిరుణాళ్లలో భక్తులను విషేశంగా ఆకట్టుకునేలా శ్రీ మేధా దకిణా మూర్తి విగ్రహం, ఎకశిలా నంది విగ్రహం భక్తులకు దర్శనం ఇవ్వనున్నాయి.
 
 
ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు  డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… పల్నాడుకి మణిహరం లాంటి కోటప్పకొండ అభివృద్ధి తమ లక్ష్యం అని పునరుద్ఘటించారు. ఇవాళ ప్రతిష్టించుకున్న ఏకశిలా నంది విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మహానందిలో నంది విగ్రహం చెక్కిన శిల్పి ప్రసాద్ తో కోటప్పకొండలో ఇవాళ ప్రతిష్టించిన నందిని చెక్కడం జరిగింది అని తెలిపారు. దక్షిణా మూర్తి విగ్రహం కూడా ఈ నెల 25 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు కూడా 25 నాటికి పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసా రావు , జెడ్పీటీసీ చిట్టిబాబు , కొండ కావూరు సర్పంచ్ నాగిరెడ్డి , ఆలయ ఈవో రామ కోటి రెడ్డి , జమిందార్ , కపిలవాయి విజయ కుమార్ , ముక్కు వేంకటేశ్వర రెడ్డి , మట్ల లింగారెడ్డి , పాలపర్తి వేంకటేశ్వర రావు , ఖాదర్ బాషా , చిన్న బుజ్జి  తదితరులు పాల్గొన్నారు.
 
Tags:An amazing event was discovered at Kotappakonda

Natyam ad