పుంగనూరులో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకరు

– వాహనదారులు ఒకరు మృతి
– మరోకరి పరిస్థితి విషమం
 
పుంగనూరు ముచ్చట్లు:
 
అతివేగ ంగా ఎదురుగా వస్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో మిత్రులలో ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం రాత్రి మండలంలోని పట్రపల్లె జాతీయ రహదారి వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దూళ్ళవాళ్లఇండ్లకు చెందిన మురుగప్ప కుమారుడు నాగమణి(24) , గట్టప్ప కుమారుడు సుబ్రమణ్యం(22) ఇరువురు స్నేహితులు. ఇద్దరు కలసి పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై పట్రపల్లెకు వెళ్లి తిరిగి సాయంత్రం పుంగనూరుకు వస్తుండగా పట్రపల్లె మలుపు జాతీయ రగదారి వద్దకు రాగానే ఎదురుగా మదనపల్లె వైపు అతివేగంగా వెళ్తున్న ఆయిల్‌ట్యాంకర్‌ ద్విచక్రవాహహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రమణ్యం అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. నాగమణి తీవ్ర రక్తగాయాలతో పడి ఉండగా గ్రామస్తులు కనుగొని 108కు సమాచారం అందించారు. 108లో సుబ్రమణ్యంను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి , ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటనతో దూళ్లవాళ్లఇండ్లలో విషాద చాయలు అలుముకున్నాయి.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: An oil tanker collided with a two-wheeler at Punganur

Natyam ad