తేనెటీగల దాడిలో వృద్ధుని మృతి

అశ్వారావుపేట ముచ్చట్లు::
తేనెటీగలు దాడి చేయటంతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని రావి చంద్రశేకర్ ఇంటికి ఆయన బంధువు కృష్ణా జిల్లా గంటసాల గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ (55) నాలుగు రోజుల క్రితం వచ్చాడు. ఇద్దరూ కలిసి కేంద్రంలో పాలు పోసి ఇంటికి తిరిగి వెళ్తుండగా కంచర్ల రామారావు పొలం వద్ద ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన సతీష్‌కుమార్ అపస్మారక స్థితిలో కిందపడ్డాడు. వెంటనే చికిత్స కోసం ప్రయివేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సతీష్‌కుమార్ మృతి చెందాడు. మృతదేహాన్ని మృతుని స్వగ్రామం గంటసాలకు పంపించారు.
Tag : An old man killed in attack by bees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *