Andhra Pradesh DSC Notification Release

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

Date : 06/12/2017

అమరావతి ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ధరఖాస్తు చేసుకునేందుకు…

*డిఎస్సీ నోటిఫికేషన్‌ డిసెంబర్‌ 15
*ధరఖాస్తులు స్వీకరణ డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
*ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు తీసుకునేందుకు చివరితేదీ మార్చి 9
*రాత పరీక్షలు మార్చి 23, 24, 26
*రాతపరీక్ష కీ విడుదల ఏప్రిల్‌ 9
*కీపై అభ్యంతరాలు స్వీకరణ ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు.
*తుదికీ విడుదల తేదీ ఏప్రిల్‌ 30
*ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ విడుదల చేౖసి అభ్యర్థులకు సమాచారం మే 11
*ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన మే 14 నుంచి 19 వరకు.
*నియామకాల ఉత్తర్వులు జూలై 18 .

పరిష్కరిస్తాం..
1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఎమ్యెల్సీ, అధికారులతో కమిటీ నియమిస్తున్నట్లు గంటా తెలిపారు. నివేదిక రాగానే అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు.

Tags : Andhra Pradesh DSC Notification Release


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *