Annadata martigosha

అన్నదాత మృత్యుఘోష

-ఆదుకోని సర్కారు చేయూత!
-దైయనీయంగా మారిన రైతు బతుకు?

Date :21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

దేశీయంగా రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకులు, ప్రభుత్వాలు మారినా విధానాలు మారకపోవడంతో రైతు మరణాలకు అంతే లేకుండా పోతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతిరోజు 16 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక ప్రభుత్వ లెక్కలోకి ఎక్కని రైతు మరణాలు ఇంతకి రెట్టింపు ఉంటాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో తాజా లెక్కల ప్రకారం గత ఏడాది దేశ వ్యాప్తంగా 5 వేల 600 మంది అన్నదాతలు ఆత్యహత్యలు చేసుకున్నారు. అంటే గంటన్నరోకో రైతు బలవన్మరణానికి దిగుతున్నాడన్న మాట. వాతావరణం అనుకూలించక, సకాలానికి రుణాలు దొరక్క, దొరికిన రుణాలకు వడ్డీలు కట్టలేక, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలు రైతలను ఉసురు తీసుకునేలా చేస్తున్నాయి. అన్నపూర్ణగా పేరున్న దేశంలో రైతన్నల ఆక్రందనలు వినే నాథుడే కరువయ్యాడు. నేషనల్‌ క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో తాజా లెక్కల ప్రకారం… రైతు మరణాల్లో పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది అక్కడ 2 వేల 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహారాష్ట తర్వాతి స్థానం మన తెలంగాణదే. కొత్త రాష్టం ఏర్పడ్డ తర్వాత కూడా ఇక్కడి రైతుల కష్టాలు తీరలేదు. కడగండ్లు ఆగలేదు. తెలంగాణలో 898 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్టు క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో లెక్కలో తేలింది. రైతుల కోసం అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని కేసీఆర్‌ సర్కార్‌ చెబుతున్నా రైతుల్లో మాత్రం ధైర్యాన్ని నింపలేకపోతుందనటానికి రైతు మరణాలే నిదర్శనం. మహారాష్ట, తెలంగాణలో బ్యాంకుల నుంచి రైతులకు అందుతున్న రుణాలు అత్యల్పం. దీంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటనష్టంతో పాటు వడ్డీ వ్యాపారుల వేధింపులతో రైతన్నలు చావును ఆశ్రయిస్తున్నారని క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో తెలిపింది. ఈ రెండు రాష్టాల తర్వాత ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది మధ్యప్రదేశ్‌లో. అక్కడ 826 మంది రైతులు గత ఏడాది ప్రాణాలు తీసుకున్నారు. మొత్తం రైతు మరణాల్లో మహారాష్ట 45.5 శాతం, తెలంగాణ 15.9, మధ్యప్రదేశ్‌ 14.6 శాతంగా నమోదైంది. రైతుమరణాల్లో 75 శాతం మరణాలు ఈ మూడు రాష్టాల్లోనే నమోదవుతున్నాయి. రైతు మరణాల్లో నాలుగో స్థానం ఛత్తీస్‌గఢ్‌. నిలుస్తుంది. అక్కడ 400 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక నిలుస్తుంది. అక్కడ 321 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. అదే ఏపీలో 160 మంది, కేరళా 107, తమళనాడు 68, ఉత్తరప్రదేశ్‌ 63. అయితే అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాలు, బీహార్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడలేదని నేషనల్‌ క్రైమ్‌ రికార్ట్స్‌ బ్యూరో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో ఏళ్లకొద్దీ సాగిన వామపక్షాల పాలన గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో అక్కడ అన్నదాతల ఆత్మహత్యల్లేవు. మరోవైపు, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో వర్షాల జాడ లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో 715 మి.మీ సాధారణ వర్షపాతం కాగా తాజా లెక్కల ప్రకారం 238.8 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 124.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దాదాపు సగం వర్షపాతం మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 19 శాతం తక్కువ వర్షపాతం ఉండగా మిగతా జిల్లాలో దాదాపు సగానికి పైగా తక్కువ వర్షపాతం నమోదైంది. నిజమాబాద్‌ జిల్లాలో దాదాపు తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడినాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీజన్‌ సాధారణ వర్షపాతం 554.3 మి.మీ కాగా 166.1 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 110.9 మి.మీ (33 శాతం తక్కువ) వర్షపాతం మాత్రమే రికార్డు అయ్యింది. శ్రీకాకుళం, కర్నూలు, అనంతపూర్‌, చిత్తూరు జిల్లాలో సాధారణ వర్షపాతం ఉండగా మిగతా 9 జిల్లాలో 59 శాతం తక్కువగా వర్షాలు కురిసి రెండు రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో విత్తనాలు విత్తక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. దీనికి తోడు కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులలో నీరు అడుగంటి పోవడంతో మెల్లమెల్లగా ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా జూలై నెలాఖర్‌ నాటికి వర్షాలు కురిసి, జలశయాలలోకి నీరు చేరనట్లయితే తెలంగాణలో వరి, పత్తి, సోయాబీన్‌ లాంటి ప్రధాన పంటలు విత్తే సమయం దాటి పోనుంది. రైతాంగానికి అంతో ఇంతో లాభసాటిగా ఉండే పంటల కాలం ముగిసి పోవడంతో ప్రత్యామ్నాయ పంటలే దిక్కు కానున్నాయి. ఇందుకు వ్యవసాయశాఖ ప్రత్యా మ్నాయ పంటల ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పుతున్నప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. పరిస్థితులు తీవ్రంగా మారుతున్నప్పటికీ? పాలకులు మాత్రం ప్రకటలనలకే పరిమితమవుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రకారం కోటి ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల ఎకరాలలో పంటలు సాగు కావల్సి ఉంది. అయితే తాజా నివేదికల ప్రకారం 47 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారు. అది కూడా సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలకు పంటలు విత్తుకోగా అనంతరం ఏర్పడిన వర్షాభావ పరిస్థితులకు వేసిన పంటలు మొలకదశలోనే ఎండిపోయాయని రైతులు చెప్తున్నారు. గతేడాది ఇదే సమయానికి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 60 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కోటి 4 లక్షల 70 వేల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 29.40 లక్షల ఎకరాలలో పంటలు సాగుచేయవల్సి ఉండగా 22.29 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు సాగు చేశారు. గతేడాది 24.3 లక్షల ఎకరాలలో పంటలు సాగు జరిగింది. రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 20 లక్షల ఎకరాలలో తక్కువ పంట సాగు జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ ఉపందుకోవడానికి ఆగస్టు వరకు సమయం ఉంది. అప్పటి వరకు వర్షాలు కురిసి పరిస్థితి మెరుగవుతుందని అన్నదాతలు ఆశతో ఉన్నారు. తెలంగాణలో మాత్రం పరిస్థితి ఆందోళన కరంగా ఉందని పాలకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించనట్లయితే రైతుల పరిస్థితి దీనాతిధీనంగా మారనుందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి దాదాపు 7వారాలు గడుస్తున్నా దేశం మొత్తం మీద ఎక్కడా సంతృప్తికరంగా వర్షాలు పడలేదు. రైతులు దిగాలుతో వున్నారు. ఖరీఫ్‌ పంట దిగుబడులు 10శాతం తగ్గవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో ప్రధాన జలాశయాల్లోని నీటినిల్వ గత 10ఏళ్ల సగటు కన్నా దిగువకు పడిపోవటం ఆందోళనకరం. అధికారిక వర్గాల ప్రకారం హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ సహా ఉత్తర ప్రాంతంలోని ఆరు ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ ఈ సమయానికి గత సంవత్సరం వాటి పూర్తి సామర్థ్యంలో 56శాతం వుండగా, ప్రస్తుత నిల్వ 47శాతం. గుజరాత్‌, మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ ప్రాంతంలో 22 రిజర్వా యర్‌లలో నీటి నిల్వ 22శాతానికి (గతేడాది 45శాతం) తగ్గింది. దక్షిణాదిలోని 30 రిజర్వాయర్లలో నీటి నిల్వ గత సంవత్సరం 36శాతం కాగా ప్రస్తుతం 16శాతమే. కాబట్టి దుర్భిక్ష పరిస్థితులు దోబూచులాడుతున్నాయి. ఆగస్టు-సెప్టెంబర్‌ వర్షాలపైనే ఆశలన్నీ. అన్నదాత… అంటే ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే వాడు. అనగా రైతు. ప్రస్తుతం ఈ రైతన్న దీనస్థితిలో ఉన్నాడు. వర్షాలు లేకపోవడంతో తన భవిష్యత్‌ ఎంటనీ ఆలోచిస్తున్నాడు. అప్పులు చేసి పంటలు వేసినా ఫలితం దక్కకపోవడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. రైతులను ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంతో రైతు డీలా పడిపోతున్నాడు. అప్పులు ఎలా తీర్చాలోనని లోలోపల కుమిలిపోతున్న రైతుల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న వర్షాభావ పరిస్థితులను బట్టి చూస్తే ఖరీఫ్‌ పంట దిగుబడులు భారీగా తగ్గనున్నాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారమే దేశ వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఖరీఫ్‌ దిగుబడులు 44.91 శాతం తగ్గుతాయి. ఇక వరినాట్లు కేవలం 345.60 లక్షల హెక్టార్లకు పరిమితమయ్యాయని గతేడాదితో పోల్చుకుంటే 281.84లక్షల హెక్టార్లకు తక్కువని గణాంకాలు ఘోషిస్తున్నాయి. వరినాట్లు 17.38శాతం, పప్పుధాన్యాలు 60.19 శాతం, తృణ ధాన్యాలు 62.04శాతం, చమురు గింజల సాగు 72.12 శాతం తక్కువగా ఉందని అధికార గణాంకాలు చెప్తున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల వర్షాభావ పరిస్ధితులు ఏర్పడ్డాయని చెప్తున్న వ్యవసాయ నిపుణులు ఖరీఫ్‌ పంటల దిగుబడి ఖరీఫ్‌ పంటల దిగుబడి గతేడాది కన్నా 10 శాతం మేర తగ్గనుంది. ఇక అతివృష్టి,అనావృష్టి కారణాలతో 2013లో దేశం మొత్తం మీద 459మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్‌ క్రైం బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 407మంది మహారాష్ట్రకు చెందిన వారు కాగా 40మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని జాతీయ నేర గణాంక సంస్ధ ఇచ్చిన నివేదిక పరిస్ధితికి అద్దం పడుతోంది.

Tags : Annadata martigosha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *