వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన..నిరుద్యోగుల పోరాట విజయం.

-నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీలా వెంకటేష్.
హైదరాబాద్ ముచ్చట్లు: 
ఒకే దఫా 80 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసినందుకు నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీలా వెంకటేష్ హర్షం  వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యానగర్ లోని బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం చారిత్రాత్మకం. అందుకు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కు  ఈ సమావేశo  కృతజ్ఞతలు తెలుపుతూన్నాము. గత ప్రభుత్వాలు ఇంతకు పూర్వం ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇలా పెద్దమొత్తంలో జారీ చేయలేదన్నారు. ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. ఇది నిరుద్యోగుల పోరాట విజయమన్నారు. అలాగే 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అయితే కొన్ని ప్రభుత్వ శాఖలలో డైరెక్టు రిక్రూట్ మెంట్ కోటా  పూర్తి ఖాళీల వివరాలను అధికారులు తెలుపడం లేదు. మొత్తం ప్రభుత్వ శాఖలు 42 ఉండగా 28 శాఖలలో పోస్టులు మాత్రమే ప్రకటించారు. దేవాదాయ శాఖ, టిఎస్పిఎస్సి తో పాటు మరో 12 శాఖల నుంచి ఒక్క పోస్టు  కూడా ప్రకటించలేదు. ఇక ప్రకటించిన 28 శాఖలలో సెకండరీ విద్యా శాఖ, ఉన్నత విద్యా శాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖ, పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ పోస్టులు పూర్తిస్థాయిలో రాలేదు. ఎందుకంటే పాఠశాల విద్యాశాఖలో, ప్రభుత్వ పాఠశాలలో 24 వేలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 4900, ఆదర్శ పాఠశాలలో 2 వేలు, కస్తూర్బా పాఠశాలలో 1500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. అలాగే నాన్ టీచింగ్ పోస్టులు కూడా పెద్దఎత్తున ఖాళీగా ఉన్నవి. అలాగే హోంశాఖలో 32 వేలు ఖాళీలు ఉంటే 18,334 మాత్రమే ప్రకటించారు. హైయర్ ఎడ్యుకేషన్ లో 12 వేలకు పైగా ఖాళీలు ఉంటె 7878 పోస్టులు భర్తీ పై చేస్తామని ప్రకటించారు. ఇలా అన్ని శాఖలలో అధికారులు పూర్తి ఖాళీల వివరాలు పంపడం లేదు. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సమీక్షించి పూర్తి ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు.ఈ సమావేశం లో తెలంగాణా నిరుద్యోగ బి.సి ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య తదితరులు  పాల్గొన్నారు.
 
Tags:Announcement of replacement of thousands of jobs .. Victory of the struggle of the unemployed.

Natyam ad