Another gold price dropped

ఇంకొంచెం తగ్గిన బంగారం ధర

Date: 09/12/2017
న్యూదిల్లీ ముచ్చట్లు:
పసడి ధర రోజు రోజుకూ తగ్గుతోంది. శనివారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గడం ద్వారా రూ.29,650కి చేరింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం పాటు, అంతర్జాతీయ పరిస్థితులు బంగారం తగ్గుదలకు కారణమయ్యాయి. మరోపక్క వెండి మాత్రం కాస్త పుంజుకుంది. కిలో వెండి రూ.200 పెరగడం ద్వారా రూ.37,900లకు చేరింది. దేశీయంగా జువెలర్స్, రిటైలర్స్ నుంచి పసిడికి డిమాండ్ తగ్గిందని దీంతో బంగారం ధర పడిపోయిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అయితే అంతర్జాతీయంగా మాత్రం బంగారం 0.11శాతం పెరగడం ద్వారా ఔన్సు 1,248.20కు చేరింది. వెండి కూడా ఔన్సు 0.80శాతం పెరిగి 15.82డాలర్లుగా ట్రేడ్ అయింది.
Tags: Another gold price dropped

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *