యాంటీబయాటిక్‌ ఎక్కువైతే యాతనే

Date:21/06/2018
వరంగల్ ముచ్చట్లు:
రోగాలకు కారకమైన వైరస్‌ను అతిత్వరగా నాశనం చేసే మెడిసిన్ యాంటీబయోటిక్స్‌. ఇటీవలిగా వైద్యులు సైతం యాంటిబయోటిక్స్ నే రోగులకు ఫ్రిఫర్‌ చేస్తున్నారు. అయితే ఈ దివ్యఔషధం వాడకం శ్రుతిమించితే ప్రమాదమే అని నిపుణులు తేల్చిచెప్తున్నారు. అనారోగ్యాలను తగ్గించే ఈ మందును అతిగా వాడితే అనేక రుగ్మతలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలిగా రోగ నిర్థారణ లేకుండానే యాంటీబయోటిక్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో తాత్కాలిక ఉపశమనం లభించినా తర్వాత రోగాన్ని నియత్రించలేని పరిస్థితి వస్తోంది. ఈ మందుల వినియోగం ఎంతమేరకు తగ్గిస్తే అంత మంచిదనే భావన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ దుష్ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రైవేటు వైద్యులు, కార్పొరేట్‌ ఆస్పత్రులు దీని వాడకాన్ని తగ్గించి రోగుల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని అంటోంది. సాధారణంగా
దగ్గు, జ్వరం, జలుబులకు యాంటి బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. జబ్బులకు సంబంధించిన వైరస్‌ను బట్టి మందులను వైద్యులే రాయాల్సి ఉంది. కానీ విచ్చలవిడిగా వీటిని వాడటంతో తాత్కాలికంగా రోగాన్ని నయం చేసినా, తర్వాత బ్యాక్టీరియా తన శక్తిని పెంచుకుని మళ్లీ విజృంభిస్తోంది. మళ్లీ జబ్బు వచ్చి మందులు వాడినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు.
యాంటీబయాటిక్‌ మందుల వాడకం ఎక్కువ కావడం వల్ల కొన్ని రకాల జబ్బులు తిరగబెడుతున్న పరిస్థితి ఉంటోంది. ప్రధానంగా మలేరియా, యూరినరీ ఇన్‌ఫెక్షన్‌, శ్వాసకోశ వ్యాధులు, కాలేయం, క్షయ, హెచ్‌ఐవీ వంటి వ్యాధుల్లో మందుల మోతాదు ప్రమాణాలను పాటించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం టిబిలో మల్టీడ్రగ్‌ రెసిస్టెన్సీ బాగా పెరుగుతోంది. ప్రాథమిక దశలో టిబి ఉన్నవారికి మందులను సరైనవిధంగా వైద్యులు సూచించకపోయినా రోగులు వాడకపోయినా అది ఎండీఆర్‌టీబీగా మారే ప్రమాదం ఉంటుంది. దీంతో ఎన్నిసార్లు మందులు వేసుకున్నా వ్యాధి తగ్గుముఖం పట్టదని ఆయన అన్నారు. ఇటువంటి రోగులకు టిబి కల్చర్‌, సెన్సివిటి తదితర పరీక్షలు చేస్తామని వైద్యులు అంటున్నారు. అనంతరం ఖరీదైన సెకెండ్‌ లైన్‌ మందులను పంపిణీ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. యాంటీబయోటిక్స్ బిజినెస్ వరంగల్ జిల్లాలో భారీ స్థాయిలో ఉంది. రూ.కోట్లలోనే వ్యాపారం సాగుతోంది. వ్యాధిని నిర్థారించకుండానే యాంటీబయాటిక్‌ మందులు రాయడం సరైన పద్దతి కాదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. వ్యాధికి మూల కారణమైన వైరస్‌ను టెస్ట్‌ల ద్వారానే గుర్తించి మందులు ఇవ్వాలని స్పష్టంచేస్తున్నారు. లేకుంటే ఒక్కోసారి వైరస్‌ పుంజుకునే అవకాశమూ ఉందని అంటున్నారు. యాంటీబయోటిక్స్ వాడకం ఏడు రోజులు మించకూడదు. అయితే కొందరు వైద్యులు పదిరోజులకు పైగా వీటిని వాడమని సూచిస్తున్నారు. ఇది దుష్పలితాలకు దారితీస్తుందని నిపుణులు తేల్చిచెప్తున్నారు.
యాంటీబయాటిక్‌ ఎక్కువైతే యాతనేhttp://www.telugumuchatlu.com/antibiotic-excess/
Tags; Antibiotic excess

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *