ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం..

అమరావతి  ముచ్చట్లు:
ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉర్దూను రెండో భాషగా గుర్తిస్తూ చట్ట సవరణ చేశారు. 35 అజెండా అంశాలపై ఏపీ కేబినెట్‌లో చర్చించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత దివంగత మంత్రి, మంత్రివర్గ సహచరుడు గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. జిల్లాల విభజనకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై త్రివర్గం చర్చించింది. ఏపీ అధికార భాషా చట్టం 1966 సవరణ,రెండవ భాషగా ఉర్దూ,విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణ,నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం,టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం హిందు ధార్మిక సంస్థల చట్ట సవరణ,మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ. 8741 కోట్ల రుణ,సమీకరణకు ఏపీ మారిటైమ్ బోర్డుకు హామీ ఉండేందుకు కేబినెట్ ఆమోదం,ఖాయిలా పడిన చక్కెర కర్మాగారాల్లోని ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశం,మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ. 214 కోట్ల వ్యయం.
 
Tags:AP Cabinet approves 1966 Amendment to the AP Official Languages Act

Natyam ad