తిరుపతి బయలుదేరిన ఏపీ గవర్నర్

విజయవాడ ముచ్చట్లు:
 
 
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు గవర్నర్ హాజరుకానున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరుపతి నుండి బిశ్వభూషన్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ముచ్చింతల్ సమతా మూర్తి విగ్రహావిష్కరణ వేడుకలకు ఏపీ గవర్నర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరిగి రాత్రికి విజయవాడ రాజ్‌భవన్‌కు గవర్నర్ హరిచందన్ చేరుకోనున్నారు.
 
Tags: AP Governor leaves for Tirupati

Natyam ad