ఖరారయిన ఏపీ హైకోర్టు టెండర్లు

Date:10/08/2018
అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. హైకోర్టు నిర్మాణ పనులు దక్కించుకునేందుకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా రెండు సంస్థలకంటే తక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ టెండర్లు పిలవగా..షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హైకోర్టు భవనం స్ట్రక్చర్ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు.
Tags: AP High Court Tests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *