కేంద్ర బడ్జెట్ చుట్టూ ఏపీ రాజకీయాలు

Date:14/02/2018
విజయవాడ ముచ్చట్లు:
రాజీనామాలు చేసేందుకు సిద్దం కావాలని తమ పార్టీ నేతలకు చెప్పారు జగన్. కొందరు సరే అన్నారు. మరికొందరు రాజీనామాలు చేస్తే పార్లమెంటులో పోరాడేదెవరు అంటూ ప్రశ్నించారు. వీరిలో తిరుపతి ఎంపీ వర ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. మేకపాటి అదే తరహా ప్రశ్న వేశారట. ఫలితంగా జగన్ ఆలోచనకు వారు గండి పెడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని బీజేపీ ఏపీ నేతలే అంతర్గతంగా ఒప్పుకుంటున్న నిజం. కాకపోతే బయటకు చెప్పలేకపోతున్నారు. అలాంటిది వైకాపా నేతలు మాత్రం బడ్జెట్ బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. కొన్ని అంశాలు కొందరికి బాగా నచ్చవచ్చు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కేంద్ర బడ్జెట్ బాగుందని కితాబునిచ్చారు. కానీ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ బాగుందని చెప్పడమే కాదు ఆ తర్వాత ఆందోళన చేయడం విచిత్రం.ఇప్పుడు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ప్రకటించారు. ఫలితంగా డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే దిశగా వైకాపా కదులుతోంది. అందుకే తిరిగి రాజీనామాలు చేసేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్దంగా ఉండాలని జగన్ ఆదేశించారు. బీజేపీతో తాడో పేడో తేల్చుకునే దిశగా టీడీపీ కదులుతోంది. హస్తినకు వెళ్లే చంద్రబాబు చివరి ప్రయత్నం చేసి రానున్నారు. అందుకే ఇప్పుడు వైకాపా తనదైన శైలిలో హోదా కోసం పోరాటం అంటూ ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. నగరిలో జగన్ అడుగు పెట్టిన సందర్భంలో ఆయన నా సంపాదనంతా ఖర్చు పెట్టించారని రోజా వాపోయిందట. ఇక జగన్ టూర్ లో ఖర్చును స్థానిక నేతలు పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ను చూసి నేతలే భయపడుతున్నారట. ఖర్చు పెట్టుకోవాల్సి రావడమే ఇందుకు కారణమంటున్నారు. నంద్యాలలో శిల్పా సోదరులు ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఇప్పుడు మిగతా వారు అదే పరిస్థితిలో ఉన్నారట. ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా పటిష్టం చేసుకునే దిశగా వైకాపా నేతల చర్యలు ఉండనున్నాయి.
Tags: AP politics around the central budget

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *